Headlines

ఇలాక్కూడా చేస్తారా! ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్

శంషాబాద్‌: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్‌ రాము, రమావత్‌ మోతిలాల్‌, రమావత్‌ గాంధీ, సుధీర్‌ కలిసి నకిలీ నోట్ల తయారీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్‌ ద్వారా నకిలీ నోట్లు తయారు…

Read Full News

విపరీతంగా జుట్టు రాలుతోందా? డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు ఇవే!

1. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా సర్జరీలు: టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు/చిన్నపాటి సర్జరీలు జరిగిన 2 నుండి 3 నెలల తర్వాత తీవ్రంగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనిని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అంటారు. శరీరానికి ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన చికిత్సతో ఇది క్రమంగా తగ్గుతుంది. 2. ఐరన్ మరియు ఫెర్రిటిన్ లోపం: ముఖ్యంగా భారతీయ మహిళల్లో శరీరంలో  ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యల వల్ల ఫెర్రిటిన్ తగ్గినప్పుడు హెయిర్…

Read Full News

Hyderabad: మహిళపై వేధింపులు.. బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, దాడి, బెదిరింపులు, కులం పేరుతో దూషించడం వంటి ఆరోపణలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి జక్కుల కిరణ్‌కుమార్ తనతో సన్నిహితంగా మెలిగారని మహిళ ఫిర్యాదులో ఆరోపించారు. వ్యాపార భాగస్వామ్యం కోసం…

Read Full News

ICC Ratings: ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు? ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి?

ICC Ratings: ప్రతి వారం ఐసీసీ విడుదల చేసే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్ల స్థానాలు తలకిందులవ్వడం చూస్తూనే ఉంటాం. తాజాగా బుమ్రా మూడో స్థానానికి పడిపోగా ఒలీ రాబిన్సన్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. అసలు ఈ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఎలా లెక్కిస్తుందో, దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతివారం మహిళలు, పురుషుల క్రికెట్ విభాగాల్లో టీమ్‌లతో పాటు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తూనే ఉంటుంది. సాధారణంగా మహిళల ర్యాంకింగ్స్ మంగళవారం,…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాఫిక్ లేని ప్రయాణం.. పోలీసుల కీలక నిర్ణయమిదే..

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్‌, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్‌ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్‌ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సున్‌ప్రీత్‌ సింగ్‌ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం…

Read Full News

ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచే 5 సింపుల్ జపనీస్ సూత్రాలు

ఉసోజి (Oosouji) – కొత్త ఆరంభం కోసం సంపూర్ణ శుభ్రత: జపాన్‌లో నూతన సంవత్సరానికి ముందు ఇల్లంతా మూలమూలలా డీప్ క్లీన్ చేసే పురాతన ఆచారమే 'ఉసోజి' (పెద్ద శుభ్రత). మనసులోని ప్రశాంతత ఇంటి పరిశుభ్రతతో ముడిపడి ఉంటుందని, ఇంట్లో మురికి ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని వారి నమ్మకం. మంచాలు, సోఫాలు, ఫ్రిజ్‌లు పక్కకు జరిపి వాటి వెనుక భాగాన్ని శుభ్రం చేస్తారు. విరిగిపోయిన, అవసరం లేని వస్తువులను వదిలించుకుంటారు. మనం కూడా ఏడాదికి ఒకసారే…

Read Full News

Monsoon Kitchen Tips: వర్షాకాలంలో మసాలా పొడులు గడ్డకడుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి!

మసాలాలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే వాటిని ఎక్కడ, ఎలా నిల్వ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించడం, తడి చెంచాలను మసాలా జాడీల్లో పెట్టకపోవడం, స్టవ్ దగ్గర నిల్వ చేయకపోవడం వంటి చిన్న జాగ్రత్తలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మసాలా జాడీల్లోకి ఆవిరి, తేమ వెళ్లకుండా చూసుకోవాలి. మసాలాల్లో మార్పులు కనిపించినప్పుడు వాటిని తిరిగి ఆరబెట్టి ఉపయోగించడం కంటే పారేయడం మంచిదని సూచిస్తున్నారు. 1. గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయండి మసాలా పొడులను…

Read Full News

పది చదివి.. పెద్ద డాక్టర్లలా ఫోజులు! హైదరాబాద్‌లో 10 మంది ఫేక్‌గాళ్లు అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ వైద్యుల దందాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వైద్య అధికారులతో కలిసి ఏకకాలంలో 10 నకిలీ క్లినిక్‌లపై మెరుపు దాడులు నిర్వహించారు. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పేట్‌బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్‌చెరు, ఆర్సీపురం తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స…

Read Full News

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆల్‌టైమ్ రికార్డు ధరలతో వినియోగదారులను ఆందోళనకు గురిచేసిన పసిడి మార్కెట్‌లో సెప్టెంబర్‌ 2, బుధవారం ఊహించని విధంగా భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయ విపణిలో తలెత్తిన ఒత్తిడి, ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యల కారణంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,070లు తగ్గి రూ.1,52,020 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1900 తగ్గి రూ.1,39,350 లకు…

Read Full News

దుమ్మురేపేలా పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు వంటి చర్యలతో ఆయన రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సాధారణంగా ఫ్యాన్స్…

Read Full News