Headlines

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌


డ్రైవింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక నూతన విధానాన్ని తీసుకురానుంది. ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్లు తగ్గించే సరికొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 66వ సియామ్ వార్షిక సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ పరిమితి దాటితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయి. అదే సమయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా సురక్షితంగా డ్రైవ్ చేసే ఉత్తమ డ్రైవర్లకు ‘గుడ్ పాయింట్లు’ కేటాయించి, తద్వారా బీమా ప్రీమియంలలో ప్రత్యేక రాయితీలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కేవలం లైసెన్స్‌లకే కాకుండా వాహన రిజిస్ట్రేషన్‌కు కూడా ఈ పాయింట్ల విధానాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో బస్సు ప్రమాదాల్లో 3,855 మంది, ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 81,780 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల 14,466 మంది, హిట్ అండ్ రన్ కేసుల్లో 34,030 మంది మరణించినట్లు వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, తాగి వాహనం నడపడం, ఫోన్ వాడకం వంటివే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. భారీ వాహనాల ఆపరేటర్లకు విక్రయానికి ముందే తప్పనిసరి శిక్షణ ఇవ్వాలని జేసీబీ వంటి కంపెనీలను ఆయన కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Ramba Urvasi Menaka Review: చాలా రోజుల తర్వాత అల్లరోడి మార్క్‌ కామెడీ.. నవ్వించాడా? బోర్ కొట్టించాడా?

I’m Game Review: సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..! హిట్టా..? ఫట్టా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *