Headlines

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త


పాత డీజిల్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాలనే నిబంధనలతో ఇబ్బంది పడుతున్న వాహన యజమానులకు ఊరటనిస్తూ కేంద్రం ఒక కొత్త పాలసీని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. లక్షలు వెచ్చించి కొత్త వాహనాలు కొనుగోలు చేయలేని మధ్యతరగతి, రవాణా రంగం వారి కోసం ఈ కొత్త టెక్నాలజీ ఒక గొప్ప వరంగా మారనుంది. దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, అదే సమయంలో పాత వాహనాల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా BS-III, BS-IV స్థాయి డీజిల్ ట్రక్కులు, బస్సులకు ‘రెట్రోఫిట్ ఎమిషన్ కంట్రోల్ డివైజ్’ అనే ప్రత్యేక పరికరాన్ని అమర్చే విధానాన్ని తీసుకొస్తోంది. ఈ కొత్త టెక్నాలజీని ఐఐటీ-ఢిల్లీ నిపుణులు అభివృద్ధి చేయగా, ఇప్పటికే ఇది విజయవంతంగా పరీక్షించబడిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ అత్యాధునిక పరికరం ప్రత్యేకత ఏమిటంటే.. వాహనాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా, ఉన్న డీజిల్ వెహికల్‌కే దీన్ని అమర్చవచ్చు. దీని ధర కేవలం రూ.4 వేల నుంచి రూ. 5 వేల వరకు మాత్రమే ఉంటుందని అంచనా. ఈ డివైజ్ సహాయంతో డీజిల్ పొగలోని ఊపిరితిత్తులకు హాని చేసే సూక్ష్మ ధూళికణాలను దాదాపు 90 శాతం వరకు, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను 60 శాతం వరకు సమర్థవంతంగా తగ్గించవచ్చు. దీని ద్వారా పాత BS-III మరియు BS-IV వాహనాల ఉద్గారాలను నేరుగా ఆధునిక BS-VI ప్రమాణాల స్థాయికి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ఈ రెట్రోఫిట్ డివైజ్‌ల కోసం ‘AIS-228’ నిబంధనలు కూడా రానున్నాయి. మొత్తానికి, ఈ కొత్త టెక్నాలజీతో పాత డీజిల్ వాహనాల స్క్రాప్ భయం పూర్తిగా తొలగిపోనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై..

ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్‌ రానా షాకింగ్ కామెంట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *