ఒక లోక్‌సభ సహా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు.. మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేస్తారా..?
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ ఆరు స్థానాల్లో అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16…