Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఏం రాత రాశావయ్యా.. మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
మరికొన్ని గంటల్లో పెళ్లి.. భాజాభజంత్రీలు మోగాల్సిన వేళ.. బంధుమిత్రుల రాకతో ఆ ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో నూరేళ్ల బంధంలోకి అడుగుపెట్టాల్సిన పెళ్లికొడుకు సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. కానీ ఆ సరదాయే ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కొత్తగా విడుదలైన కృష్ణా జలాల పరవళ్లను చూసేందుకు వెళ్లి, ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన వరుడితో పాటు మరో బంధువు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల…