Circadian Rhythm: ఉదయం పూటే అంత గాఢ నిద్ర ఎందుకు పడుతుంది? శాస్త్రీయ రహస్యాలు ఇవే!
రాత్రి తగినంత నిద్ర లేనప్పుడే ఉదయం లేవడానికి ఇబ్బంది పడతామని అనుకుంటారు. కానీ ఇది మన శరీరంలోని ‘సిర్కాడియన్ రిథమ్’ అనే జీవ గడియారం హార్మోన్ల కార్యకలాపాల వల్ల జరుగుతుంది. మన వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే మరింత సంతృప్తికరమైన నిద్రను అనుభూతి చెందుతారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిర్కాడియన్ రిథమ్.. మన శరీరంలోని జీవ గడియారం రాత్రిపూట మనల్ని నిద్రకు సిద్ధం చేసి, ఉదయం మేల్కొలపడానికి సంకేతాలు…