Headlines

Kagiso Rabada Smoking : అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఒకరి తర్వాత ఒకరుగా సిగరెట్ తాగుతూ దొరికిపోతున్న క్రికెటర్లు

Kagiso Rabada Smoking : అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ..  ఒకరి తర్వాత ఒకరుగా సిగరెట్ తాగుతూ దొరికిపోతున్న క్రికెటర్లు


Kagiso Rabada Smoking : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, మైదానంలో ఆటగాళ్ల మెరుపుల కంటే బయట వారు చేస్తున్న పనులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు బహిరంగంగా సిగరెట్లు తాగుతూ దొరికిపోవడం క్రీడా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సిగరెట్ తాగుతూ కనిపించగా, ఇప్పుడు సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కాగిసో రబాడ వంతు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడ, ఒక చోట కూర్చుని దర్జాగా సిగరెట్ తాగుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ, ఇది ఏదో ఒక హోటల్ లేదా స్టేడియంలోని ప్లేయర్స్ ఏరియాలో తీసినట్లు కనిపిస్తోంది. ఫిట్‌నెస్ మీద అత్యంత శ్రద్ధ చూపే అథ్లెట్లు ఇలా బహిరంగంగా ధూమపానం చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాహల్ వివాదం మరవకముందే..

కొద్దిరోజుల క్రితమే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. తన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును నడుపుతూ, కారు కిటికీలో నుంచి వెలుగుతున్న సిగరెట్‌ను బయటకు విసిరేస్తూ చాహల్ కెమెరాకు దొరికిపోయాడు. ఆ వీడియోను ఒక అభిమాని షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో చాహల్ మీద విమర్శల వర్షం కురిసింది. ఇప్పుడు రబాడ కూడా అదే బాటలో నడవడంతో క్రికెట్ ప్రేమికులు పెదవి విరుస్తున్నారు.

ఐపీఎల్ 2026లో రబాడ ప్రదర్శన

వివాదాలు పక్కన పెడితే, మైదానంలో మాత్రం రబాడ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో అతను 10 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో కూడా ముందు వరుసలో ఉన్నాడు. అయితే ఇటువంటి వీడియోలు బయటకు రావడం వల్ల అతడి ఇమేజ్‌తో పాటు జట్టు పేరు కూడా దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హెచ్చరిస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. క్రికెటర్లు యువతకు రోల్ మోడల్స్ గా ఉండాలి.. ఇలాంటి పనులు చేయడం తప్పు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, “అది వారి వ్యక్తిగత విషయం, ఆట మీద దాని ప్రభావం లేనంత వరకు పర్వాలేదు” అని మరికొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏది ఏమైనా, బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలని మెజారిటీ అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *