Jabardasth: ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?

Jabardasth: ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?


Jabardasth: ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?

మెగా బ్రదర్ నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ జడ్జిగా కూడా బాగా ఫేమస్ అయ్యారు.
నవ్వుల నవాబు నాగబాబు అంటూ జబర్దస్త్ ఆయన వేసే కామెడీ టైమింగ్ పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మాజీ మంత్రి రోజాతో కలిసి ఆయన చేసిన సందడిని బుల్లితెర అభిమానులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. నిజం చెప్పాలంటే జబర్దస్త్ కు బాగా హైప్ రావడానికి కంటెస్టెంట్లతో పాటు నాగబాబు, రోజాలు కూడా ప్రధానకారణమని చెప్పవచ్చు. అయితే చాలా ఏళ్ల పాటు జబర్దస్త్ లో జడ్జిగా చేసిన నాగబాబు అనూహ్యంగా ఈ షోకు దూరమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో రోజా కూడా ఈ షో నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఈ షోకు చాలా మంది జడ్జిలుగా వస్తున్నారు.. పోతున్నారు. కృష్ణ భగవాన్, ఖుష్బూ, సంఘవి, మనో.. ఇలా చాలా మంది జడ్జిలుగా చేశారు.

కాగా జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను ఓ సందర్భంలో పంచుకున్నారు నాగబాబు. జబర్దస్త్ నిర్మాణ సంస్థతో విబేధాలు వచ్చాయని, వాటితో పాటు వివిధ కారణాలతోనే ఈ షోకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు. కాగా జబర్దస్త్ కు దూరమయ్యాక అదిరింది వంటి కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించారు నాగబాబు. అయితే ఆ షోలు జబర్దస్త్ అంత సక్సెస్ కాలేకపోయాయి. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా మారిపోయారు నాగబాబు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా సేవలు అందిస్తున్నారు. కాగా 2019 లో నాగబాబు జబర్దస్త్ కి దూరమయ్యారు. అయితే ఇటీవల ఓ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ లో మళ్లీ కనిపించి అలరించారు మెగా బ్రదర్. ఈ విషయాన్ని ఈటీవీ అధికారికంగా ప్రకటించింది. నాగబాబు జడ్జిగా జబర్దస్త్ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. ఆ షూటింగ్ కి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి నవ్వుల నవాబు నాగబాబు కంబ్యాక్ అని విషెస్ తెలిపింది. త్వరలోనే ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం.

కాగా నాగబాబు కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కే వచ్చారా? లేదా గతంలో లాగా ఫుల్ టైం జడ్జిగా కొనసాగనున్నారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒక వేళ నాగబాబు రీ ఎంట్రీ మాత్రం కంటెస్టెంట్లకు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కమెడియన్లకు చాలా మద్దతుగా నిలుస్తారు. ఈ విషయాన్ని జబర్దస్త్ కమెడియన్లే స్వయంగా వెల్లడించారు. ఇక నాగబాబు ఇటీవల పడిపోయిన జబర్దస్త్ రేటింగ్ పెరగడానికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *