ఇంటర్వ్యూకు వెళ్తుంటే దొంగ అంటూ అరెస్ట్.. కట్‌చేస్తే ‘కెనడా వారెన్ బఫెట్’గా ఎదిగిన ప్రేమ్ వత్సా!
కెనడాలోని టొరంటోలో ఓ రోజు.. 24 ఏళ్ల ప్రేమ్ వత్సా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకు హడావుడిగా వెళ్తున్నారు. ఇంటర్వ్యూకు ఇంకా 20 నిమిషాల సమయం మాత్రమే ఉంది. చేతిలో ఫైల్ పట్టుకుని వేగంగా నడుస్తున్న ఆయనకు.. అకస్మాత్తుగా ‘దొంగ.. పారిపోతున్నాడు.. పట్టుకోండి’ అంటూ కేకలు వినిపించాయి. ఆ మాటలు తనను ఉద్దేశించినవని తెలుసుకునేలోపే పోలీసులు అతడిని పట్టుకున్నారు. బేడీలు వేసి, తుపాకీ గురిపెట్టి ప్రశ్నించారు. వీధి చివర్లోని ఓ బ్యాంకులో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడిగా ప్రేమ్‌ను…