Headlines

తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?


టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుతం తీవ్ర వివాదాలతో సతమతమవుతోంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇప్పుడు డ్యాన్సర్స్ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకవైపు ప్రస్తుత చైర్‌పర్సన్ సుమలత, జానీ మాస్టర్ వర్గం ఉండగా, మరోవైపు శేఖర్ మాస్టర్ సారథ్యంలో ఇంకో వర్గం ఉంది. ఈ వివాదానికి ప్రధాన కారణాలలో ఒకటి లోకల్ వర్సెస్ నాన్-లోకల్ డ్యాన్సర్ల సమస్య. తెలుగు సినిమాల్లో స్థానిక డ్యాన్సర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే నియమం ఉన్నప్పటికీ, కొందరు డ్యాన్స్ మాస్టర్లు నాన్-లోకల్ డ్యాన్సర్లను ఎక్కువగా తీసుకొస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల స్థానిక డ్యాన్సర్ల ఉపాధి దెబ్బతింటోందని శేఖర్ మాస్టర్ వర్గం వాదిస్తోంది. ఈ ఆరోపణలు జానీ మాస్టర్‌పై కూడా వచ్చాయి. మరో కీలక సమస్య కమిషన్ల దందా. డ్యాన్సర్లు కష్టపడి సంపాదించిన వేతనాల్లో దళారులు, కొందరు యూనియన్ ప్రతినిధులు భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ అక్రమ వసూళ్లు బయటపడటంతో అసోసియేషన్ లోపాలు బట్టబయలయ్యాయి. రామ్ చరణ్ 40 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఫండ్‌ను అందించగా, జానీ మాస్టర్ తన సొంత రెమ్యూనరేషన్‌ను కూడా అసోసియేషన్ సంక్షేమానికి డొనేట్ చేశానని చెబుతున్నారు. ఈ గొడవ పెద్దదవ్వడంతో ఫిల్మ్ ఫెడరేషన్ రంగంలోకి దిగింది. జానీ మాస్టర్‌పై బ్యాన్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఇండస్ట్రీలో అక్కినేని హీరోల టైం మొదలైందా..?

విజయ్ ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ పై ఆసక్తి

టాలీవుడ్‌లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్

తెలంగాణ పల్లె కథల వైపు టాలీవుడ్ చూపు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *