Headlines

Gold Price: వామ్మో నెల రోజుల్లో బంగారం ధర ఇంత తగ్గిందా? లక్షకు దిగి రానుందా?


ప్రస్తుతం గోల్డ్‌ మార్కెట్ కుప్పకూలుతుంది. ధరలు అమాంతంగా పడిపోతున్నాయి. గత నెల రోజుల్లో బంగారం ధర సుమారు 8% వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నెలవారీగా బంగారం సుమారు 8.26% క్షీణించింది. ధరల పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కారణమవుతున్నాయి. భారత్, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,22,150 వద్దకు చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధర 2,85,000 రూపాయల వద్దకు చేరుకుంది. గత పది రోజుల్లో బంగారం 11,340 రూపాయలు వరకు తగ్గుముఖం పట్టిందంటే ధరలు ఏ మేరకు తగ్గుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా పది రోజుల్లో భారీగా తగ్గిపోయింది. ఏకంగా 20 వేల వరకు దిగి రావడం గమనార్హం.

ఇక గత నెల అక్టోబర్‌ 18వ తేదీన తులం బంగారం ధర రూ.1,47,660 వద్ద ఉండగా, ఇప్పుడు చూస్తే భారీగా తగ్గింది. ఏకంగా 14 వేల రూపాయలపైగా తగ్గడం గమనార్హం. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు ఐదు కీలక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్ విలువ, ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్ వీటిలో ముఖ్యమైనవి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాల్లో డిమాండ్ తగ్గితే వెండి ధరలపై మరింత ఒత్తిడి పడవచ్చు. అయితే రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయలకు దిగి రానుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



బంగారం తగ్గటానికి అమెరికా డాలర్ విలువ పెరగటం ప్రధాన కారణంగా చెబుతున్నాయి ఈ క్రమంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే వార్తలతో బంగారం వైపు పెట్టుబడులు తగ్గిపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే.. బంగారంలో పెట్టుబడులు తగ్గిపోతాయి. ఇది మరో కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. ఇదే క్రమంలో డాలర్ విలువ పెరగటంతో.. ఇతర దేశాల్లో బంగారం ధరలు పెరిగాయి.

ఇది కూడా చదవండి: Rice Adulteration Tips: కల్తీ బియ్యాన్ని ఎలా గుర్తించాలి? సింపుల్‌ ట్రిక్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *