
దశాబ్దాలుగా వెండితెరపై హీరోలుగా అదరగొట్టి అభిమానులను అలరించిన సీనియర్ నటులు ఇప్పుడు విలన్ పాత్రల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. తమ కెరీర్ పీక్స్ లో ఉండగా అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ తారలు, ఇప్పుడు రూట్ మార్చి బ్యాడ్ బాయ్స్ గా మారిపోతున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.కింగ్ నాగార్జున గత సంవత్సరం కూలీ సినిమాలో సైమన్ పాత్రలో తనదైన స్టైలిష్ విలనిజాన్ని ప్రదర్శించారు. బ్యాడ్ బాయ్‌గా మారితే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడడానికే ఈ నెగటివ్ క్యారెక్టర్ చేశాను అని నాగార్జున స్వయంగా తెలిపారు. రొమాంటిక్ హీరోగా దశాబ్దాలుగా మెప్పించిన ఆయన, సడన్ గా విలన్‌గా మారి తనలోని సరికొత్త నటనను బయటపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.కమల్ హాసన్ సైతం విలన్‌గా ఇప్పటికే ప్రేక్షకులను భయపెట్టారు. కల్కిలో ఆయన పోషించిన సుప్రీమ్ ఆస్కిన్ అనే పవర్ఫుల్ నెగిటివ్ రోల్ అందరినీ మైమరిపించింది. తాజాగా కన్నడ ప్రేక్షకులు దేవుడిగా ఆరాధించే శివరాజ్ కుమార్ కూడా డేర్ డెవిల్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.