ఆమె తన చిన్న కుమారుడికి, అప్పుడు కేవలం నాలుగు, ఐదు నెలల వయస్సున్న శిశువుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు కుమారుడిని చూసుకున్నా, తల్లిగా ఆమె హృదయ స్పందన వినకుండానే కుమారుడు పెరిగాడు. దానివల్ల వచ్చిన పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆసుపత్రిలో ఒక కుర్చీలో నిద్రపోయి, అక్కడే ఉండి కుమార్తెను చూసుకునేవారు. కుమార్తె కోలుకున్న తర్వాత, డాక్టర్ “ఇక ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు, సంవత్సరానికి ఒకసారి వస్తే చాలు” అని చెప్పి, వారికి అభినందనలు తెలిపారు.