Headlines

Hyderabad: ఫుడ్ పాయిజన్ కలకలం.. మండీ బిర్యానీ తిని చిన్నారులు సహా 9 మందికి అస్వస్థత!


Hyderabad: ఫుడ్ పాయిజన్ కలకలం.. మండీ బిర్యానీ తిని చిన్నారులు సహా 9 మందికి అస్వస్థత!

హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అంబర్‌పేటలోని ముక్రం బిర్యానీ హోటల్‌లో మండీ బిర్యానీ తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. రామంతపూర్, అంబర్‌పేట ప్రాంతాలకు చెందిన ఓ కుటుంబం నవంబర్ 15వ తేదీన గాంధీ బొమ్మ సమీపంలోని ముక్రం బిర్యానీ హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుని బంధువులతో కలిసి తిన్నారు. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ విషయంపై కుటుంబ సభ్యులు హోటల్ యజమానిని నిలదీయగా, బాధితులకు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే బాధితుల్లో ఓ మహిళకు న్యూరో సంబంధిత సమస్య తలెత్తడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మెరుగైన వైద్యం కోసం బాధితులను బుధవారం (నవంబర్ 18) నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు వైద్యులు. బాధితుల్లో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తానా, మహ్మద్ ఆమీర్ తదితరులు ఉన్నారు.

ఈ ఘటనలో బాధితుల సంఖ్యపై భిన్నమైన వివరాలు వెలువడుతున్నాయి. తొలుత ఏడుగురని, మరో సమాచారం ప్రకారం తొమ్మిది మందని తెలుస్తోంది. ఆహార కలుషితమే కారణమా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. హోటల్‌లో ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *