Headlines

Varanasi: ‘వారణాసి’ షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్


వారణాసి షూటింగ్ అప్‌డేట్ ఏంటి..? ఎంతవరకు వచ్చింది..? సోషల్ మీడియాలో వచ్చేది వస్తూనే ఉంటుంది.. వినిపించేది వినిపిస్తూనే ఉంటుంది. కానీ అసలు మ్యాటర్ ఏంటి..? అసలు షూట్ ఎంత పూర్తైంది.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? నిజంగానే 90 పర్సెంట్ పూర్తైపోయిందా.. వారణాసి కోసం రాజమౌళి ఏం మ్యాజిక్ చేస్తున్నారు..? గుంటూరు కారం తర్వాత ఫోకస్ అంతా వారణాసిపైనే పెట్టారు మహేష్ బాబు. మరోవైపు రాజమౌళి కూడా గత సినిమాల కంటే సూపర్ స్టార్‌తోనే సూపర్ ఫాస్టుగా షూటింగ్ చేస్తున్నారు. ఓవైపు ప్రమోషన్.. మరోవైపు షూట్ రెండూ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూట్ పూర్తైపోయింది.. చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. ముందు చెప్పిన దానికంటే త్వరగానే టాకీ పూర్తి చేస్తున్నారు జక్కన్న.వారణాసిని IMAX ఫార్మాట్‌ షూట్ కూడా పూర్తైందని ఈ మధ్యే చెప్పారు రాజమౌళి. ఈ ఫార్మాట్ కోసం కథలో మార్పులేం చేయలేదని.. ఆ కెమెరాలకు తగ్గట్లుగా చిన్నచిన్న సర్దుబాట్లు మాత్రమే చేసామన్నారు. ఈ సినిమాకు అటు ఐమాక్స్, ఇటు సినిమా స్కోప్‌కు సరిపోయేలా అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ చేస్తున్నామని చెప్పారు రాజమౌళి. డబ్బింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ అంటే అంటే సినిమా ప్రదర్శిస్తున్నపుడు ఆ స్క్రీన్‌కి తగ్గట్లు వీడియో అండ్ ఇమేజ్ క్వాలిటీ దెబ్బతినకుండా.. అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకునేలా షూట్ చేసే ప్రక్రియ. అది మొదట్లో అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టినా.. తర్వాత అంతా సెట్ అయిందన్నారు దర్శక ధీరుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 7, 2027న విడుదల చేస్తామన్నారీయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్‌.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!

కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్

Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *