హైదరాబాద్, సెప్టెంబర్ 21: దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర నియామక సంస్థలు పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలు కీలక నియామక పరీక్షలు జరగనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)లకు సంబంధించిన పరీక్షలు ఈ రెండు నెలల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీలను ముందుగానే తెలుసుకుని, అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్‌తో ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు.
సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగే పరీక్షల తేదీలు ఇవే..
- SBI క్లర్క్ పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 26, 27 తేదీల్లో
- SSC CGL (టైర్-1) పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు
- IBPS PO/MT (మెయిన్స్) పరీక్ష తేదీ: అక్టోబర్ 4
- RRB టెక్నీషియన్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 6, 9 తేదీల్లో
- IBPS క్లర్క్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 10, 11 తేదీల్లో
- RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 12, 13 తేదీల్లో
- RRB JE పరీక్ష తేదీలు: అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో
పరీక్ష తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు తమకు సంబంధించిన సిలబస్‌ను మరోసారి పరిశీలించుకోవాలి. ఇప్పటికే చదివిన అంశాలను రివిజన్ చేయడంతో పాటు మాక్ టెస్టులు, ప్రీవియస్ పేపర్లు, ప్రాక్టీస్ ప్రశ్నలను సాధన చేయడం ద్వారా పరీక్షకు సన్నద్ధతను పెంచుకోవచ్చు. అలాగే ప్రతి పరీక్షకు సంబంధించిన CBT విధానం, సిలబస్, పరీక్ష సమయం, మార్కుల విధానం వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలి. పరీక్షకు ముందు చివరి రోజుల్లో కొత్త అంశాల కంటే రివిజన్, మాక్ టెస్టులు, ముఖ్యమైన టాపిక్స్‌పై దృష్టి పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది.