పదేళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ‘లెనిన్’ సినిమాతో రావడంతో.. అఖిల్ కెరీర్ ఇకపై న్యూ టర్న్ తీసుకోబోతుందా..? ‘ఏజెంట్’ టైమ్‌లో అగ్రెసివ్‌గా కనిపించిన అయ్యగారు.. ఇప్పుడెందుకు అంత సైలెంట్ అయ్యారు..? సక్సెస్ తెచ్చిన మెచ్యూరిటీనే ఇది అనుకోవచ్చా..? కథల ఎంపికలో అక్కినేని వారసుడు రూట్ ఎటు..? నెక్ట్స్ నటనకు ఆస్కారమున్న పాత్ర చేస్తారా లేక కమర్షియల్ బాట పడతారాఅఖిల్ కెరీర్ ఇన్నాళ్లూ ఒక లెక్క.. ‘లెనిన్’ సినిమా తర్వాత ఇంకో లెక్క. దాదాపు పదేళ్లుగా ఆయనెంతో వేచి చూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సక్సెస్ ఎట్టకేలకు ఈ సినిమాతోనే దక్కింది. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడటంతో పాటు అఖిల్ కెరీర్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో 2.0 వర్షన్ మొదలవుతుంది. ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది కూడా. సక్సెస్ వచ్చినా కూడా అఖిల్ దాన్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా చాలా హుందాగా ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది. ‘ఏజెంట్’ టైమ్‌లో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించిన అయ్యగారు.. ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్నారు. పైగా ఇకపై సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు ప్రామిస్ చేయడమే కాదు.. వచ్చే ఏడాదిలోపే మరో సినిమా చేస్తానని మాటిస్తున్నారు. ప్రస్తుతం కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు అఖిల్.. అందులో ఇద్దరు ముగ్గురు కొత్త దర్శకులు కూడా ఉన్నారు. నెక్ట్స్ ఏం చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ‘లెనిన్’ తరహాలోనే నటనకు ఆస్కారమున్న పాత్ర చేస్తారా లేక కమర్షియల్ బాట పడతారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!
కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!