Headlines

Shruti Haasan: శృతి హాసన్‌కి కలిసొచ్చిన సమంత ప్రెగ్నెన్సీ బ్రేక్


సమంత ప్రెగ్నెన్సీ శృతి హాసన్‌కు వరంగా మారిందా..? ఏకంగా ఇంటర్నేషనల్ ఆఫర్ వచ్చేలా చేసిందా..? 12 క్రితం ఓ సినిమాలో ఇలాగే స్యామ్ ఆఫర్ తీసుకుని హిట్ అందుకున్న శృతి హాసన్.. పుష్కరం తర్వాత మరోసారి ఆ సీన్ రిపీట్ చేస్తున్నారా..? అసలు సమంత చేయాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శృతి చేతికి ఎలా వచ్చింది.. ఈ మూవీ ముచ్చట్లేంటి..? పెద్ది సినిమాతో తెలుగులో మరోసారి ట్రెండ్ అయ్యారు శృతి హాసన్. ప్రెగ్నెన్సీ వల్ల సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో.. ఆమె చేయాల్సిన చెన్నై స్టోరీ అనే ఇండో యూకే ఫిల్మ్ శృతి చేతికి వచ్చిందిప్పుడు. బాఫ్టా అవార్డు విన్నర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు టైమేరి ఎన్ మురారి రాసిన ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల మూలం. సమంత స్థానాన్ని శృతి తీసుకోవడం ఇదేం తొలిసారి కాదు. అప్పట్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఎవడు సినిమాలో ముందు సమంతనే హీరోయిన్‌గా తీసుకుని ఓ షెడ్యూల్ కూడా చేసారు.. కానీ స్కిన్ ప్రాబ్లమ్స్‌తో స్యామ్ ఆ సినిమా నుంచి తప్పుకుంటే శృతి హాసన్ సీన్‌లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ తర్వాత శృతి కెరీర్‌కు ఎవడు సినిమా బాగా హెల్ప్ అయింది. పుష్కరం తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. చెన్నై స్టోరీలో శృతి హాసన్ సరసన వివేక్ కల్రా లీడ్ రోల్ ప్లే చేస్తుండగా కెవిన్ హార్ట్, విన్సెంట్ లాంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో చెన్నై స్టోరీ భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. అన్నట్లు మూడేళ్ళ కింద ‘ది ఐ’ సినిమాతో ఆల్రెడీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శృతి. ఇప్పుడు సమంత చేయాల్సిన చెన్నై స్టోరీ ఆఫర్ అందుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్‌.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!

కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్

Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *