పవర్ బ్యాంక్: మీరు ఎక్కవుగా ప్రయాణించేవారు మీకు పవర్ బ్యాంక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్లేప్పుడు ఒక అధిక సామర్థ్యం (mAh) ఉన్న పవర్ బ్యాంక్‌ను మీతో పాటు తీసుకెళ్లడం ద్వారా ఫోన్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ప్రతస్తుం మార్కెట్లో లభించే ఫాస్ట్-ఛార్జింగ్ పవర్ బ్యాంకుల ద్వారా ఫోన్‌ను చాలా త్వరగా చార్జ్ చేసుకోవచ్చు.
ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ USB పోర్ట్: ఈ విషయం చాలా మందికి తెలియదు. మన దగ్గర ఛార్జర్ లేకపోయినా సరే కేవలం కేబుల్ మాత్రమే ఉంటే.. దాన్ని ఉపయోగించి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా మన ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సాధారణ ఛార్జర్‌తో పోలిస్తే ఇలా ల్యాప్‌టాప్ లేదా సిస్టమ్ ద్వారా ఛార్జింగ్ వేగం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది.
కారు ఛార్జింగ్: దీర్ఘకాలిక ప్రయాణాల్లో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడికైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు మన ఫోన్లో అవసరమైన ఛార్జింగ్ లేకపోతే.. కార్లో ఉండే USB పోర్ట్ లేదా కార్ ఛార్జింగ్ అడాప్టర్ ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం డేటా కేబుల్‌ను కారు USB పోర్ట్‌కు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మీరు గమన్యానికి చేరుకునే లోపు మీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది.
పబ్లిక్ వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్లు: ఈ మధ్య కాలంలో ప్రయాణికులకు సౌకర్యార్థం పబ్లిక్ ప్లేస్‌లలో కూడా చార్జింగ్ ప్లగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేప్పుడు ఇబ్బంది లేకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, కేఫ్‌లలో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు అందుబాటులో ఉంచుతున్నారు. మీ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తే, ఎలాంటి కేబుల్స్ అవసరం లేకుండా ఫోన్‌ను ఆ ప్యాడ్‌పై ఉంచితే సరిపోతుంది. నిమిషాల్లో మీ ఫోన్ ఛార్జ్ అవుతుంది.
రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్: ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి వస్తున్న చాలా ఫోన్లు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తున్నాయి. అంతే కాదు ఫోన్లలో ఉండే బ్యాటరీ కెపాసిటీని కూడా కంపెనీలో బాగా పెంచేశాయి. ఎమర్జెన్సీ సమయాల్లో మన ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.ఈ రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ ద్వారా కేబుల్ సహాయంతో మీ వద్ద ఉన్న మరొక ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్, ఇయర్ బడ్స్ వంటి పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.




