80-90వ దశకాలలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. హిందీ, తెలుగు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. మెగాస్టార్ చిరంజీవి జోడీగా అపద్భాంధవుడు చిత్రంలో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే తెలుగులో మంచి హిట్ అందుకున్నప్పటికీ అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆమె.. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. ఆమె విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు మీనాక్షి శేషాద్రి తిరిగి రాబోతున్నారని, అది కూడా 40 ఏళ్ల క్రితం తన సహనటుడు జాకీ ష్రాఫ్‌తో కలిసి అని వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, మీనాక్షి శేషాద్రి జాకీ ష్రాఫ్‌తో మరోసారి తెరపై కనిపించనున్నారు. అయితే, ఈసారి అది సినిమా కాదని, ఒక వెబ్ సిరీస్ అని అంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..
నివేదిక ప్రకారం, విపుల్ షా వెబ్ సిరీస్ ‘నానావతి వర్సెస్ నానావతి’ ద్వారా మీనాక్షి శేషాద్రి నటనలోకి రీఎంట్రీ చేయబోతున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రితో కలిసి పనిచేయనున్నారని టాక్. చాలా కాలం తర్వాత ఈ జంట మళ్లీ కలిసి కనిపించనుంది. వీరిద్దరూ గతంలో 1983లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘హీరో’లో కలిసి కనిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
ఈ సిరీస్‌లో మీనాక్షి శేషాద్రితో పాటు భాగ్యశ్రీ, రామ్ కపూర్, అనుప్రియ గోయెంకా కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అయితే, ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై అధికారిక సమాచారం ఏదీ లేదు. కొన్ని రోజుల క్రితం మీనాక్షి శేషాద్రి విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చారని వార్తలు వచ్చాయి. ఈసారి, ఆమె తన నటనారంగ కెరీర్ కోసం ముంబైలో శాశ్వతంగా స్థిరపడబోతున్నారని వెలుగులోకి వచ్చింది. మీనాక్షి ముంబైలో అడుగుపెట్టిన వెంటనే, ఆమెకు ఒక పెద్ద వెబ్ సిరీస్ లభించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి అరంగేట్రం చేయబోతోంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
మీనాక్షి శేషాద్రి..
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..