Headlines

Cyber Crime: భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ వల.. ఇలాంటి వెబ్ సైట్లతో బీ కేర్‌పుల్.. ఒక్కసారి క్లిక్ చేస్తే ఖతమే..

Cyber Crime: భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ వల.. ఇలాంటి వెబ్ సైట్లతో బీ కేర్‌పుల్.. ఒక్కసారి క్లిక్ చేస్తే ఖతమే..


సీజన్ ముగింపు సేల్ వచ్చేసింది.. అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు పొందండి.. తక్కువ ధరకే సొంతం చేసుకోండి అంటూ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో మనం ప్రకటనలు చూస్తూ ఉంటుంది. దీంతో ఈ ఆఫర్లకు ఆకర్షితులై చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ, బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ బ్రాండ్లు తమ వద్ద ఉన్న సరుకును ఖాళీ చేసేందుకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, క్లోన్ చేసిన మొబైల్ యాప్‌లు, మోసపూరిత సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. డిస్కౌంట్ల పేరుతో ప్రజలను ఆకర్షించి చెల్లింపు వివరాలను దొంగిలిస్తున్నారు. అనంతరం వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు.

ఇన్‌స్టంట్ ఆఫర్లు

సైబర్ నేరగాళ్లు విశ్వసనీయ బ్రాండ్‌లను పోలిన వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా స్టోర్‌ఫ్రంట్‌లు, నకిలీ యాప్ లింక్‌లను సృష్టిస్తున్నారు. ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, గోల్డ్ కాయిన్ ఆఫర్లు, యూపీఐ రివార్డులు, ప్రయాణ రాయితీలు, సులభంగా లోన్ అందిస్తామంటూ డబ్బు కాజేస్తున్నారు. కార్డు వివరాలు, యూపీఐ ఆధారాలు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్, డబ్బు సంపాదించే లక్ష్యంతో సాగే సైబర్ ప్రచారాలు నిరంతరంగా ముప్పు తెచ్చి పెడుతున్నాయి. వినియోగదారులు జాగ్రత్త కంటే అత్యవసరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు మోజులో పడి నకిలీ వెబ్ సైట్ల ఊబిలో చిక్కుకుంటున్నారు. దీంతో మీరు ఏదైనా వస్తువు కొనాలనుకునే సమయంలో వెబ్‌సైట్ అడ్రస్ ధృవీకరించుకోవాలి. ఆ వెబ్ సైట్ చరిత్రను తనిఖీ చేయాలని, తెలియని వ్యాపారులకు ముందస్తు చెల్లింపులు చేయకుండా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి సమయంలో తొందరపాటు వద్దు

ఎల్లప్పుడూ సురక్షితమైన, గుర్తించదగిన చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ‘కేవలం రెండు వస్తువులు మాత్రమే మిగిలి ఉన్నాయి’ వంటి మెస్సేజ్‌లు, 70-90 శాతం తగ్గింపులు అవకాశాన్ని కోల్పోతామేమోనన్న భయాన్ని కలిగిస్తాయి. ఇలాంటివి తరచుగా కొనుగోలుదారులను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రధాన ఆన్‌లైన్ సేల్ ఈవెంట్‌ల సమయంలో కూడా ఇలాంటి మోసపూరిత పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఈవెంట్‌లలో నకిలీ దుకాణాలు, వినియోగదారుల సమాచారాన్ని సేకరించడానికి ప్రసిద్ధ బ్రాండ్‌ల వల్లే నటిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *