Headlines

Prakasham Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల!


తుఫాన్ ఎఫెక్ట్‌తో వచ్చిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు భారీ మొత్తం వరద ప్రవాహం పేటెత్తింది. దీంతో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 20 గేట్లను అడుగుమేర ఎత్తి సుమారు 14 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌కు వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిని క్రమంగా దిగువకు వదులుతున్నారు. వరద నీటి విడుదల నేపథ్యంలో బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి, కాలువలు, వాగుల వద్దకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇప్పటికే బ్యారేజ్ గేట్లను ఎత్తడంతో దిగువకు వరద ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు గుమిగూడకుండా అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.వరద ప్రవాహం నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నదిలోకి వెళ్లడం, నీటి ప్రవాహం వద్దకు వెళ్లడం వంటి సాహసాలు చేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు బ్యారేజ్ వద్ద ఇరిగేషన్ అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం, బ్యారేజ్‌లో నీటి మట్టాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *