Headlines

స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!


పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు చెన్నైకి చెందిన శంకర్. స్విగ్గీలో ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తూ ఆయన గత 8 ఏళ్లలో ఏకంగా రూ.53 లక్షలు సంపాదించారు. ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని స్విగ్గీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ లెక్కలను పరిశీలిస్తే శంకర్ సగటున ఏడాదికి రూ. 6.62 లక్షలు, నెలకు సుమారు రూ. 55,208 సంపాదించారు. ఈ ఆదాయంతోనే తన పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు కుటుంబానికి మంచి ఆర్థిక భద్రత కల్పించినట్లు ఆయన సంతోషంగా తెలిపారు. ఆర్డర్లు ఎక్కువగా ఉండే లంచ్, డిన్నర్ పీక్ అవర్స్‌లో మాత్రమే తెలివిగా లాగిన్ అవుతూ.. ఇన్సెంటివ్‌లు, సర్జ్ ప్రైసింగ్ ద్వారా ఈ స్థాయి ఆదాయం సాధించినట్లు శంకర్ వెల్లడించారు. శంకర్ కష్టపడే తత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నప్పటికీ, పెట్రోల్ ఖర్చులు, బైక్ మెయింటెనెన్స్ పోను చేతికి వచ్చే నికర ఆదాయం, పీఎఫ్ వంటి ప్రయోజనాలు లేకపోవడంపై గిగ్ ఎకానమీలో సవాళ్లను కొందరు ప్రస్తావిస్తున్నారు. అయితే తమ డెలివరీ భాగస్వాములకు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తున్నామని స్విగ్గీ తెలిపింది. సరైన ప్రణాళిక ఉంటే ఫుడ్ డెలివరీ కూడా స్థిరమైన జీవనోపాధిగా మారుతుందని శంకర్ నిరూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు

మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్‌.. హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన

విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *