బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ ప్రక్రియ సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. తీరం దాటినప్పటికీ ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 12 గంటల పాటు దీని తీవ్రత కొనసాగి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే
Gold Price: బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజే రూ.1,520 పతనం
Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?
స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు