టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని చిన్న సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ గద్దలకొండ గణేశ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆమె నటించిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిందీ అందాల తార. అయితే ఎందుకో స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది డింపుల్. ఇప్పటివరకు తన అందం, డ్యాన్స్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా తిరుమలలో తన అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్‌తో భక్తులను మైమరిపించింది. కూచిపూడి నృత్యం చేసి అందరి మన్ననలు అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది డింపుల్. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా హీరోయిన్ డింపుల్ హయాతి గల్ఫ్ (2017) సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేశ్, యురేకా, ఖిలాడీ, రామబాణం, దిల్ మార్, అత్రంగిరే (హిందీ), వీరమే వాగై సూదం (తమిళ్), భర్త మహాశయులకు తదితర సినిమాలు డింపుల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘భోగి’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది డింపుల్. ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి.. వీడియో ఇదిగో..
Actress #DimpleHayathi spotted seeking divine blessings at the historic Sri Kalahasteeswara Swamy Temple. ✨🙏 Always beautiful to see our stars connect with their spiritual side ❤️#Bhogi #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/UjHtYHZBku
— Telugu FilmNagar (@telugufilmnagar) September 24, 2026