Andhra: భక్తులు లాగుతున్న రథం ఒక్కసారిగా నిలిచిపోయింది.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..?
అనంతపురం జిల్లా ఉరవకొండలోని సుప్రసిద్ధ గవి మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో ప్రాంతమంతా మారుమోగింది. అయితే రథోత్సవం మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారీ రథం సగం దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయింది. భక్తులు ఎంత ప్రయత్నించినా రథం ముందుకు కదల్లేదు. దీంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో గవి మఠానికి చెందిన ఏనుగు ముందుకు వచ్చి రథ చక్రాలను తలతో…