Andhra Pradesh: ఏపీలోని యువతకు ప్రభుత్వం సూపర్ ఛాన్స్.. రూ.4 లక్షల వరకు పొందోచ్చు.. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు..
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. జనరిక్ మందుల షాప్ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించనుంది. రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులను యువతకు ప్రభుత్వం కేటాయించనుంది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ చదువుకున్న బీసీ నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. తొలి విడతలో రాష్ట్రంలో 198 షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.7.92 కోట్లు కేటాయిస్తూ…