వార్ ఎఫెక్ట్.. బంగారం, వెండిపై లాభాలు బుక్ చేసుకోవడానికి ఇదే సరైన టైమా?
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ బులియన్ మార్కెట్‌పై పడింది. సోమవారం బంగారం, వెండి ధరలు గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ధరలు ఎగబాకడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. శుక్రవారం కామెక్స్‌లో అంతర్జాతీయ స్పాట్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా MCX ఫ్యూచర్స్‌లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశీయ సెషన్లో బంగారం ధర 0.08 శాతం తగ్గి…