Headlines

Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?


Pakistan vs England: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ మొదటి ఐదు వికెట్లు 50 పరుగుల్లోపే కోల్పోయింది. లంచ్ విరామానికి పాకిస్థాన్ 100/7తో నిలవగా, ఉదయం సెషన్ పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యంలో సాగింది. ముఖ్యంగా ఒల్లీ రాబిన్ సన్ (Ollie Robinson) తన రెడ్ బాల్ (red-ball) స్పెల్‌తో పాక్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

టాప్-5 కలిపి 24 పరుగులే..

పాకిస్థాన్ తొలి ఐదుగురు బ్యాటర్లు కలిసి చేసిన పరుగులు కేవలం 24. 2000 తర్వాత టెస్టు ఇన్నింగ్స్‌లో పాక్ టాప్-5 బ్యాటర్ల అత్యల్ప స్కోర్ల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. 2012లో దుబాయ్‌లో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ టాప్-5 కేవలం 19 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి అత్యల్ప స్కోరు ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో నమోదైన 24 పరుగులు.

26 ఏళ్ల తర్వాత అరుదైన పతనం..

పాకిస్థాన్ టాప్-5 బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటవడం టెస్టు చరిత్రలో అరుదైన ఘటన. ఇంతకుముందు పాక్ టాప్ ఐదుగురు 1959లో వెస్టిండీస్‌పై ఢాకాలో, 1981లో ఆస్ట్రేలియాపై WACAలో, 1995లో జింబాబ్వేపై హరారేలో, 1999లో భారత్‌పై కోల్‌కతాలో మాత్రమే ఇలాంటి పతనాన్ని ఎదుర్కొన్నాయి. 2026 బర్మింగ్‌హామ్ టెస్టు ఆ జాబితాలో చేరింది.

బౌలర్ల దెబ్బకు పాక్ విలవిల..

ఇంగ్లాండ్ బౌలింగ్ దాడికి పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ సమాధానం చెప్పలేకపోయింది. ఒల్లీ రాబిన్ సన్ వికెట్ల వేటలో ముందుండగా, జోస్ టంగ్ (Josh Tongue), జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) చెరో వికెట్ తీసి పాక్ కష్టాలను మరింత పెంచారు. ఫలితంగా ఉదయం సెషన్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 100/7 వద్ద నిలిచింది.

2013 తర్వాత మళ్లీ ఇదే స్థాయిలో..

టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్లు 50 పరుగుల్లోపే కోల్పోవడం చివరిసారి 2013లో దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ టెస్టులో జరిగింది. బర్మింగ్‌హామ్‌లోనూ అదే తరహా పతనం పునరావృతమైంది. లంచ్ తర్వాత పాక్ మిగిలిన 3 వికెట్లతో ఎంతవరకు స్కోరు పెంచుతుందనేదే కీలకంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *