Headlines

మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా? మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాట్లే కారణం!


కాచిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా కొన్నిసార్లు త్వరగా పాడవుతుంటాయి. దీనికి కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. పాలు మరిగించిన తర్వాత పెద్ద పాత్రలోనే గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పాలను ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్‌లో పెట్టకుండా లోపలి తక్కువ ఉష్ణోగ్రత ఉండే భాగాన నిల్వ చేయడం శ్రేయస్కరం. పాలను సురక్షితంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు ఉన్నాయి..

గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచడం:

పాలు కాచిన తర్వాత చాలామంది ఆ పెద్ద పాత్రలోనే పాలను ఎక్కువ సమయం బయటే ఉంచేస్తుంటారు. గది ఉష్ణోగ్రత వద్ద పాలు ఎక్కువసేపు ఉంటే అందులో బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాలు త్వరగా పాడవుతాయి.

వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం:

కొందరు పాలు త్వరగా చల్లారాలని బాగా వేడిగా ఉన్న పాత్రను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. దీనివల్ల ఫ్రిడ్జ్‌లోని అంతర్గత ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇది పాలను మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్‌లోని ఇతర నిల్వ పదార్థాలను కూడా త్వరగా పాడుచేస్తుంది.

ఇవి కూడా చదవండి



సరైన పాత్రను ఎంచుకోకపోవడం:

పాలను కాచిన పెద్ద పాత్రలోనే కాకుండా, శుభ్రమైన, సరిగ్గా మూత పెట్టగలిగే ఆహార సురక్షిత పాత్రలలోకి మార్చడం చాలా ముఖ్యం. పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే పెద్ద పాత్రకు బదులుగా చిన్న చిన్న పాత్రల్లోకి విభజించి పెట్టడం వల్ల పాలు త్వరగా చల్లారడమే కాకుండా ఫ్రిడ్జ్‌లోని ఇతర వాసనలు పాలకు పట్టకుండా ఉంటాయి.

ఫ్రిడ్జ్ డోర్‌లో పాలను నిల్వ చేయడం:

ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్‌లలో పాలను పెట్టడం చాలామంది చేసే మరొక పెద్ద పొరపాటు. ఫ్రిడ్జ్ తలుపులు తరచుగా తీస్తూ వేస్తూ ఉండటం వల్ల డోర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందువల్ల పాలను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లోపలి వైపు, చల్లదనం స్థిరంగా ఉండే మధ్య లేదా దిగువ షెల్ఫ్‌లలో నిల్వ చేయడం మంచిది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పాలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *