Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శన టికెట్ల జారీ బంద్.. ఎన్ని రోజులంటే..?
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఈ నెల 3న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయ ముఖద్వారాలు మూతపడనున్నాయి. ఈ కారణంతో శ్రీవారి దర్శనాలు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనాలకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు బంద్ కానుండటంతో 2,3వ తేదీలకు ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు…