Headlines

Tollywood : ప్రివ్యూ చేసి ఎవడొస్తాడు ఈ సినిమాకు అన్నారు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది

దర్శకుడు శివనాగేశ్వరరావు తన కెరీర్‌లో అత్యంత కీలకమైన, మరచిపోలేని సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంటూ, తన తొలి చిత్రం మనీ విడుదలకు ముందు, తర్వాత ఎం.ఎస్.రెడ్డి గారితో జరిగిన అనుభవాలను వివరించారు. మనీ సినిమా విడుదలకు ముందు, అన్నపూర్ణ స్టూడియోలో ఎం.ఎస్.రెడ్డి గారు, సి.నారాయణ రెడ్డి గారు ఈ సినిమా ప్రత్యేక ప్రొజెక్షన్‌లో వీక్షించారు. సినిమా పూర్తయిన తర్వాత, ఎం.ఎస్.రెడ్డి గారు దర్శకుడి భుజంపై చేయి వేసి, “నాగేశ్వరరావు, దీంట్లో పల్లెటూరి జనం చూడటానికి ఏముంది.?” అని…

Read Full News

సింగరాయకొండ గురుకులంలో తాగునీటి కష్టాలు.. తాగేందకు నీళ్లులేక విద్యార్ధినుల ఇక్కట్లు!

సింగరాయకొండ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డా.బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్ధినుల ఇక్కట్లు మిన్నంటుతున్నాయి. తాగునీటి కొరత కారణంగా దాహార్తితో అల్లాడిపోతున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 13) పేరెంట్స్ సండే కావడంతో మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకునేందుకు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. అయితే హాస్టల్‌లో తాగునీళ్లు అందుబాటులో లేవని తెలిసి.. తమ పిల్లల వద్ద ఉన్న బాటిళ్లు తీసుకుని హాస్టల్ ఎదురుగా ఉన్న దుఖానాల వద్దకు తల్లిదండ్రులు పరుగులు తీశారు….

Read Full News

Tirumala: తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. దర్శన టికెట్ల జారీ బంద్.. ఇక నేరుగా..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఉచిత ఎస్‌ఎస్‌డీ టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తారనే విషయం తెలిసిందే. తర్వాతి రోజు దర్శనానికి ముందు రోజు టికెట్లను జారీ చేస్తారు. తిరుపతిలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్‌లో వీటిని పంపిణీ చేస్తారు. అయితే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ నెల 14వ తేదీ…

Read Full News

Telangana: వినాయక విగ్రహం కోసం వెళ్తే ప్రాణమే పోయింది.. అసలేం జరిగిందంటే..?

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణేశుడి విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. విగ్రహ విక్రేతల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జోడిమెట్ల చౌరస్తాలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. చౌదరిగూడ గ్రామానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వినాయక చవితి…

Read Full News

Ramayana New Poster: ఆహా.. ఎంత రమణీయంగా ఉందో.. రామాయణం మూవీ నుంచి లేటెస్ట్ పోస్టర్

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక  రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.  ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా పోస్టర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతారాములుగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి కనిపించి కనిపించి ఆకట్టుకోనున్నారు. తాజాగా రామాయణం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను గణేశ్ చతుర్థి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రణ్‌బీర్…

Read Full News

Hyderabad: వారంలో రెండోసారి.. ఓల్డ్‌ సిటీ వాసులను వణికిస్తున్న వరుస ఘర్షణలు!

హైదరాబాద్ పాతబస్తీలోని పటేల్ మార్కెట్‌లో దుకాణదారుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణం ముందు వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఒక దుకాణదారుడికి, పక్కనే ఉన్న మరో దుకాణం యజమానులు, సిబ్బందికి మధ్య వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదట మాటామాటా జరిగింది. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన స్నేహితులు, సోదరులకు సమాచారం…

Read Full News

Abhishek Sharma: సంజూ శాంసన్‌ను వెనక్కి నెట్టిన అభిషేక్.. యువరాజ్ రికార్డుపై కన్నేసిన యంగ్ స్టార్

Abhishek Sharma: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు తిరగరాశాడు. తన అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ వరుస అవార్డులను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా అత్యంత సులభంగా ఛేదించింది. ఈ విజయంలో…

Read Full News

విజయానికి ఓపికే ఆయుధం.. జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఏనుగు కథ!

ఒకసారి రవి అనే వ్యక్తి బైక్‌పై ఆఫీసుకు బయలుదేరాడు. దారిలో ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వచ్చింది. రెడ్‌ లైట్‌ ఉండటంతో ఆగాడు. గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే బయలుదేరాడు. కొంతదూరం వెళ్లగానే మరో సిగ్నల్‌ వచ్చింది. అక్కడ కూడా ఆగి.. గ్రీన్‌ లైట్‌ కోసం ఎదురుచూశాడు. మరికొంత దూరం వెళ్లగానే మూడో సిగ్నల్‌ వచ్చింది. అప్పటికే ఆఫీసుకు ఆలస్యం అవుతోంది. ఈసారి రవికి ఓపిక లేకపోయింది. ‘ఇక్కడ ఏ వెహికల్స్‌ లేవు కదా.. వెళ్లిపోదాం’ అనుకుని గ్రీన్‌ సిగ్నల్‌…

Read Full News

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రూ.30 వేల వరకు బెనిఫిట్.. వీరికి మాత్రమే..

ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు తీపికబురు అందించింది. చిరు వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు అందించనుంది. ఈ మేరకు లోక కళ్యాణ పేరుతో మేళా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వనిథి పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ.30 వేల వరకు రుణం పొందవచ్చు. ఈ మేళాలో భాగంగా పండ్లు, కూరగాయలు, తోపుడు బళ్ల వ్యాపారం చేసుకునేవారికి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు అందిస్తారు. కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.30 వేల వరకు పొందవచ్చు. ఈ నిధులను తమ…

Read Full News

Hanuman Ansh: చాలా డబ్బులు వచ్చాయి.. వాటిని ఏం చేసుకోవాలో అర్ధంకావడంలేదు..: హనుమాన్ అంశ్ నిర్మాత

ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘హనుమాన్ అంశ్’కు తొలిరోజుల్లో పెద్దగా స్పందన రాలేదు. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో సినిమాకు క్రమంగా ఆదరణ పెరిగింది. దీంతో థియేటర్లలో స్క్రీన్ల సంఖ్య కూడా పెరిగింది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లను రాబట్టింది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా భారత్‌లో రూ.214 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ వసూళ్లు సుమారు…

Read Full News