Headlines

Nandyala Crime: రౌడీషీటర్ దారుణ హత్య.. కళ్లలో కారం చల్లి, పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో దాడి!


నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంట గ్రామానికి చెందిన రౌడీషీటర్ మిద్దె నాగార్జున దారుణ హత్యకు గురయ్యారు. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. మిద్దె నాగార్జున టిడిపిలో కార్యకర్త. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అనుచరుడు. కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. వీటన్నింటినీ పక్కనబెట్టి అనంతపురం జిల్లా యాటికి ప్రాంతంలో అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో వినాయక నిమజ్జనం కోసం వచ్చాడు. కార్యక్రమం చూసుకొని తిరిగి వెళుతుండగా ఉయ్యాలవాడ దగ్గర ప్రత్యర్థులు ఒక్కసారిగా బైక్‌ని అటాక్ చేశారు. రౌడీ షీటర్ మిద్దె నాగార్జున పారిపోకుండా ముందుగా అతని కళ్ళలో కారం చల్లారు. నాగార్జున ఫ్రెండ్ పారిపోయాడు. ప్రత్యర్థులు కూడా అతనిని పట్టించుకోలేదు.

కేవలం నాగార్జున మాత్రమే ప్రత్యర్థులకు టార్గెట్. కారంపొడి చల్లిన తర్వాత నాగార్జునను సమీప పొలాల్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. కళ్ళల్లో కూడా కత్తులతో పొడిచి చంపారంటే ఇంత పగ ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు పారిపోయారు. నాగార్జున వెంట వచ్చిన వ్యక్తిని పోలీసులు గాలించి పట్టుకున్నారు. అతని ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

హత్యకు అక్రమ సంబంధం ఏమైనా కారణం ఉందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. హత్యకు గురైన నాగార్జునపై ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది. నంద్యాల జిల్లాలో జరిగే చాలా వరకు క్రైమ్‌లో రౌడీషీటర్ల పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది. వీటిని పోలీసులు కంట్రోల్ చేయాలి అనుకుంటున్న సందర్భంలో రౌడీ షీటర్ నాగార్జున హత్య కలకలం రేపుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *