మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు రవ్నీత్ సింగ్ బిట్టును పంజాబ్ పోలీసులు శనివారం (సెప్టెంబర్ 19, 2026) అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాన్వాయ్‌పై మద్యం సీసా విసిరి, గుడ్లు, టమోటాలతో బెదిరించిన తర్వాత బిట్టును అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాన్వాయ్ వెళుతున్న సమయంలో లుధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీఏయూ) వెలుపల ఈ సంఘటన జరిగింది. బీజేపీ నాయకులు తమ మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి అప్పటికే విశ్వవిద్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెళుతుండగా నిరసన తెలిపారు.
ఇదిలా ఉండగా, పోలీసుల నిర్బంధంపై స్పందిస్తూ బీజేపీ నాయకుడు రవ్నీత్ సింగ్ బిట్టు, నిర్బంధించడం, పోలీసు కేసు పెట్టడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరని బిట్లు అన్నారు. “ఈరోజు పంజాబ్ పోలీసులు మమ్మల్ని నిర్బంధించారు, కానీ మా ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదు,” అని ఆయన రాశారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్‌లో, ఆయన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ, “భగవంత్ మాన్‌పై పంజాబీల ప్రేమ” అని రాశారు. తాను భగవంత్ మాన్కు మద్యం సీసాను తిరిగి ఇస్తున్నానని మాజీ కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు అన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
కాన్వాయ్‌పై గుడ్లు, టమోటాలు విసిరారు: బిట్టు
ఇదిలా ఉండగా, ఒక రోజు ముందు శుక్రవారం (సెప్టెంబర్ 18) పఠాన్‌కోట్‌లోని మాధోపూర్‌లో బీజేపీ డ్రగ్-ఫ్రీ పంజాబ్ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా, బట్లా సమీపంలో తన కాన్వాయ్‌పై గుడ్లు, టమోటాలు విసిరారని రవనీత్ బిట్టు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు తన కాన్వాయ్‌పై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది.
వీడియో ఇక్కడ చూడండి..
ਭਗਵੰਤ ਮਾਨ ਨੂੰ ਪੰਜਾਬੀਆਂ ਵੱਲੋਂ ਲਾਹਣਤ। https://t.co/YScjlADTi2
— Ravneet Singh Bittu (@RavneetBittu) September 19, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..