దేశంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో FSSAI చీఫ్ రజిత్ పున్హాని పలు కీలక విషయాలను వెల్లడించారు. భారతదేశంలో ఆహార భద్రతా నిబంధనల పాటింపు క్రమంగా మెరుగుపడుతోందని ఆయన స్పష్టం చేశారు. చాలా తనిఖీలలో అంతా సవ్యంగానే తేలుతున్నప్పటికీ, కేవలం ఉల్లంఘనలు మాత్రమే మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఆహార భద్రతా నిబంధనలు పాటించని వారిపై భారీగా చర్యలు తీసుకున్నట్లు పున్హాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా నోటీసులు జారీ చేయగా, సుమారు 5,000 లైసెన్సులు రద్దయ్యాయి. అలాగే 600 మందికి పైగా అరెస్టు కాగా, దాదాపు 1,900 మందికి శిక్షలు పడ్డాయి. మరో 33 వేల కేసుల్లో జరిమానాలు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. అనలాగ్ పనీర్ నిషేధంపై స్పందిస్తూ.. కూరగాయల నూనెలు, పిండి పదార్థాలతో తయారయ్యే ఈ నకిలీ పనీర్‌ను ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ఎనిమిది రాష్ట్రాలు నిషేధించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై పూర్తి నిషేధం విధించేందుకు సెప్టెంబర్ 24న అన్ని రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని, అందరి అభిప్రాయాలు సేకరించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై చక్కెర, ఉప్పు, కొవ్వు శాతాన్ని సూచించే ఎరుపు రంగు షట్కోణ హెచ్చరిక లేబుళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ముసాయిదా నోటిఫికేషన్, డబ్ల్యూటీఓ ఆమోదం వంటి ప్రక్రియల వల్ల దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా సెప్టెంబర్ 30 నాటికి తయారీ, గడువు తేదీలను స్పష్టంగా చూపాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మార్కెట్లో లభించే వస్తువులు క్రమంగా సురక్షితంగా మారుతున్నాయని భరోసా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
రూ.10 లక్షల లంచం + రోజూ బిర్యానీ = ఏసీబీ షాక్!
నొప్పి తగ్గించే ఇంజెక్షన్, కిక్కిచ్చే మత్తుమందుగా మారిందా ?