Fatty Liver and Orenges: నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా? ఇందులో నిజమెంత..

Fatty Liver and Orenges: నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా? ఇందులో నిజమెంత..


నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా వచ్చే వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) కూడా ఒకటి. ఇది నేటి కాలంలో పెరుగుతున్న అతి పెద్ద సమస్య . ఈ సమస్య ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలియే ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ సమస్యను కేవలం ఒక పండు తినడం ద్వారా నివారించవచ్చని మీకు తెలుసా? అవును.. ప్రతిరోజూ నారింజ పండ్లు తినడం వల్ల ఫ్యాటీ లివర్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కాబట్టి నారింజ పండ్లు నిజంగా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయో లేదో ఇక్కడ తెలుసుకుందాం..

అధ్యయనం ఏమి చెప్పింది?

న్యూట్రియెంట్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం… 30 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల 60 మందిని పరీక్షించారు. వారిలో సగం మందికి నాలుగు వారాల పాటు ప్రతిరోజూ సుమారు 400 గ్రాముల గింజలులేని నారింజ పండ్లను ఇచ్చారు. ఈ బృందం కాలేయంలో కొవ్వు తగ్గడంతో పాటు కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన మెరుగుదల చూపించింది.

గింజలులేని నారింజ అంటే ఏమిటి?

గింజలు లేని నారింజలను సాధారణంగా నావెల్ ఆరెంజెస్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన గింజలు లేని నారింజ. దీని అసలు ఉత్పత్తి స్పెయిన్‌లో జరుగుతుంది. ఇది తీపిగా ఉంటుంది. విటమిన్ సి, పాలీఫెనాల్స్‌ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జీవక్రియను మెరుగుపరచడానికి, కాలేయం చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ నారింజలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీర నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే కేవలం నారింజ పండ్లు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేయగలవని చెప్పడం సరికాదని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నారింజ పండు మన దేశంలో కూడా దండిగా లభిస్తాయి. వైద్యుని సలహాతో ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి సహాయకరంగా ఉంటుంది. కానీ జ్యూస్‌ రూపంలో కాకుండా పండును నేరుగా తినడం మంచిది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు నారింజ పండ్లను మితంగా తీసుకోవాలి. ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు నారింజ పండ్లను తీసుకోవడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *