Headlines

FASTag: ఈ నకిలీ వెబ్‌సైట్లు ఓపెన్ చేయకండి.. ఫాస్టాగ్ విషయంలో కేంద్రం బిగ్ అలర్ట్..

FASTag: ఈ నకిలీ వెబ్‌సైట్లు ఓపెన్ చేయకండి.. ఫాస్టాగ్ విషయంలో కేంద్రం బిగ్ అలర్ట్..


FASTag: ఈ నకిలీ వెబ్‌సైట్లు ఓపెన్ చేయకండి.. ఫాస్టాగ్ విషయంలో కేంద్రం బిగ్ అలర్ట్..

ప్రస్తుతం టోల్ ఫీజు చెల్లింపులకు ఫాస్టాగ్ అనేది తప్పనిసరి అయింది. క్యాష్ పేమెంట్స్‌ను ఎన్‌హెచ్‌ఏఐ పూర్తిగా బంద్ చేయడంతో ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఫాస్టాగ్ లేనివారు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇక కొంతమంది ఫాస్టాగ్ వార్షిక పాస్ కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని నకిలీ వెబ్‌సైట్లు ఫాస్టాగ్ వార్షిక పాస్ పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇటీవల ఇలాంటి మోసాలు పెరుగుతున్న క్రమంలో.. ఇది నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్లింది. దీందో వాహనదారులను అలర్ట్ చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఒక ప్రకటన జారీ చేసింది. కొంతమంది నకిలీ వెబ్ సైట్లు సృష్టించి ఫాస్టాగ్ వార్షిక పాస్ అందిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఫేక్ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ప్రభుత్వ వెబ్‌సైట్ల తరహాలో డిజైన్

వాహనదారులను టార్గెట్‌గా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న క్రమంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది. కొంతమంది మోసగాళ్లు ప్రభుత్వ పోర్టల్స్ మాదిరిగా ఉండే వెబ్ సైట్లను క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వెబ్‌సైట్లు అసలైన పోర్టల్స్‌లానే కనిపిస్తాయి. దీంతో వాహనదారులు చాలామంది తేడాలను గుర్తించలేకపోతున్నారు. దీంతో ఫాస్టాగ్‌కు సంబంధించి ఏ పనికైనా అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని, నకిలీ ఫ్లాట్‌ఫామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. అసలైన ఫాస్టాగ్ వెబ్‌సైట్ల డిజైన్‌ను కాపీ చేస్తూ నకిలీ వెబ్‌సైట్లను మోసగాళ్లు తయారుచేస్తున్నారు. ఈ లింకులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఇవి టాప్‌లో ఉంటున్నాయి. వెబ్‌సైట్లోకి వెళ్లగానే మొబైల్ నెంబర్, వెహికల్ నెంబర్, చెల్లింపు సమాచారం వంటి వివరాలను అడుగుతున్నారు. కొంతమంది నిజమైన వెబ్‌సైట్ అనుకుని చెల్లింపులు చేసి మోసపోతున్నారు.

మోసపోకుండా ఉండాలంటే..?

రాజమార్గయాత్ర యాప్‌లో మాత్రమే ఫాస్టాగ్ వార్షిక పాస్ లభిస్తుంది. దీని నుంచే మాత్రమే తీసుకోవాలి. ఇతర ఫ్లాట్‌ఫామ్‌లకు అధికారిక అనుమతి లేదు. దీంతో వేరే సైట్లను ఆశ్రయించవద్దు. మీకు తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయవద్దు. ధృవీకరించని సైట్లలో మీ వాహనం లేదా ఫాస్టాగ్ వివరాలను పంచుకోవద్దు. రాజమార్గ యాత్ర యాప్‌ను మాత్రమే ఉపయోగించండి. ఈ సూచనలు పాటించడం వల్ల వాహనదారులు మోసగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోకుండా ఉంటారని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. ఇప్పటికైనా వాహనదారులు మోసపోకుండా ఉండాలంటే అధికారిక యాప్‌లను మాత్రమే వాడాలని, తెలియనివాటి జోలికి పోవద్దని సూచించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *