సూపర్ స్టార్ రజనీకాంత్ దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుంది. అయితే, ఈ చిత్రంలో వడివేలు భార్యగా నటించిన నటి సువర్ణ మాథ్యూస్ గుర్తుందా.. ? ఈ సినిమాలో ఆమె పాత్ర మరో హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా స్వర్ణ అంటూ రజినీకాంత్ పిలవడం.. వడివేలు అల్లాడిపోవడం ప్రేక్షకులకు నవ్వులు తెప్పించింది. ప్రస్తుతం ఆమె గురించి ప్రస్తుత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ కావడమే. సువర్ణ మాథ్యూస్ కేవలం ‘చంద్రముఖి’లోనే కాకుండా, 90వ దశకంలో అనేక దక్షిణాది సినిమాల్లో నటించారు.
ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!
మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో సహాయ నటిగా కనిపించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. చాలా కాలం విరామం తర్వాత, సువర్ణ మాథ్యూస్ ప్రస్తుత ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చంద్రముఖి సినిమాలో ఎంతో సంప్రదాయంగా, నిండుగా కనిపించిన సువర్ణ, ఇప్పుడు స్టైలీష్ లుక్కులో గ్లామరస్ బ్యూటీగా.. చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆమె వయసు పెరిగినా, ఇప్పటికీ అంతే గ్రేస్‌తో ఉండటం విశేషం. 2003లో వర్గీస్ జాకబ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.
ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..
సినిమాలకు దూరమైనప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తరచూ తన వ్యక్తిగత ఫోటోలను, విదేశాల్లో తాను గడుపుతున్న క్షణాలను పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడంతో, “ఈమె మన చంద్రముఖి నటి సువర్ణేనా?” అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సువర్ణ, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె గ్లామరస్ లుక్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..
చంద్రముఖి స్వర్ణ ఇన్ స్టా పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..