కాకరేపుతోన్న కరీంనగర్ పాలిటిక్స్.. ఒకేరోజు ఇద్దరూ.. తూర్పున సీఎం రేవంత్.. పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే, పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగనుంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో బ్లాక్ పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం…