
Chiranjeevi: బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న మెగా ఫ్యాన్స్.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మెగాభిమానులు తప్పుపడుతున్నారు. దీనికి బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 25) అఖిల భారత చిరంజీవి యువత ఒక ప్రకటన విడుల చేసింది. ‘అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా…