ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి.. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు!
వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: రాస్ప్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షించడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గింపునకు: ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రాస్ప్‌బెర్రీస్…