
Hyderabad: నగరంలో సైకిల్‌పై సవారి చేస్తున్నారా..? జాగ్రత్త
నగరంలో సేదతీరేందుకు ఉదయం సైకిల్‌పై బయలుదేరిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భాస్కర్ అనే వ్యక్తి తొక్కతున్న సైకిల్ టైరు రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ కవర్ గ్రిల్ల్స్ మధ్య ఇరుక్కుపోవడంతో కిందపడిపోయి గాయపడ్డాడు. ఈ విషయాన్ని సైక్లింగ్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్ సభ్యుడు సంతోష్ సెల్వన్ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. Our fellow family member and brother from #CyclingCommunityOfHyderabad…