Headlines

జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. యువత అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?

దేశంలోని 25 ప్రముఖ ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల మొత్తం 767 మందికి సంబంధించిన డేటాను పరిశోధకులు పరిశీలించారు. వీరంతా గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన హృదయ సంబంధ సంఘటనలను ఎదుర్కొని వాటి నుంచి బయటపడినవారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 432 మందికి గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. ఇది మొత్తం సంఖ్యలో సుమారు 56.3 శాతం. మరోవైపు 25.8 శాతం మందికి పక్షవాతం వచ్చినట్లు అధ్యయనం పేర్కొంది. మొత్తం…

Read Full News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!

Indian Railways: రైలు ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు రేపు, అంటే 04 సెప్టెంబర్ 2026 న తమ సర్వీసులను అందిస్తాయి. రైలు నంబర్‌ 07235 -సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్యాహ్నం 12:10 బయలుదేరి సాయంత్రం 5.30…

Read Full News

సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి! పచ్చిమిర్చితో టేస్ట్ అదిరిపోద్ది

కావలసిన పదార్థాలు.. సొరకాయ: 400 గ్రాములు (లేతది), నూనె: 3 టేబుల్‌ స్పూన్లు, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు): 1 టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు: 2 మీడియం సైజు (సన్నగా తరిగినవి), ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 1 టీ స్పూన్‌), పసుపు: అర టీ స్పూన్‌, కరివేపాకు: 1 రెమ్మ, పచ్చిమిర్చి: 10-12 (మీ కారానికి తగ్గట్టు), వెల్లుల్లి రెమ్మలు: 5-6, జీలకర్ర: 1 టీ స్పూన్‌, కొత్తిమీర: కొద్దిగా, పాలు: 1…

Read Full News

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. శుక్రవారం నగర వ్యాప్తంగా మాంసం షాప్‌లు బంద్!

హైదరాబాద్, 02 సెప్టెంబర్ 2026: హైదరాబాద్‌లోని మాంస విక్రయదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన…

Read Full News

వైఫై సిగ్నల్ అందక ఇబ్బంది పడుతున్నారా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్ పెట్టేయండి

ఆధునిక కాలంలో ఇంటర్నెట్ లేనిదే ఇళ్లలో ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రూటర్‌కు దూరంగా ఉన్న గదుల్లో సిగ్నల్ రాకపోతే వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త పరికరాలు కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మూలన పడి ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి వైఫై సిగ్నల్‌ను ఎలా రిపీట్ చేయాలో ఇప్పుడు సులభంగా నేర్చుకుందాం. పాత ఫోన్‌ను వైఫైకి కనెక్ట్ చేయడం మీ వద్ద ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ముందుగా…

Read Full News

బౌద్ధ సన్యాసిగా మారేందుకు.. కోట్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టాడు! కారణం తెలిస్తే అవాక్కే..

సిరిపోంగ్‌ ఆగస్టు 21న ఫేస్‌బుక్‌లో కంపెనీ విక్రయానికి సంబంధించిన ప్రకటన చేశారు. తాను అడుగుతున్న ధరకు కంపెనీని కొనుగోలు చేసే వ్యక్తిని పరిచయం చేసిన వారికి 5 మిలియన్‌ బాట్‌ (సుమారు రూ.1.4 కోట్లు) రిఫరల్‌ ఫీజుగా ఇస్తానని ప్రకటించారు. ఈ డీల్‌లో కేవలం ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ మాత్రమే కాకుండా.. సుమారు 2.77 ఎకరాల భూమి, కార్యాలయం, యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీ, అవసరమైన లైసెన్సులు, Hawell’s Ice Cream and Fast Food ఔట్‌లెట్‌, ట్రేడ్‌మార్క్‌, ఐస్‌క్రీమ్‌…

Read Full News

Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే!

మారుతి సుజుకి సెలెరియో: ఈ జాబితాలో మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలిచే మరో కారు మారుతి సుజుకి సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. పెట్రోల్ వెర్షన్ 24.97 నుండి 26.68 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 34.43 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, రోజువారీ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కారు కొనాలనుకునే వారికి ఈ మోడళ్లు బడ్జెట్‌కు అనుకూలమైన ఎంపికలుగా ఉంటాయి. వేరియంట్, ఇంధన…

Read Full News

హైదరాబాద్‌లో ద్వారక..! కిషన్ బాగ్ శ్రీ మురళి మనోహర స్వామి ఆలయ చరిత్ర తెలుసా..?

Sri Murali Manohar Swamy Temple History Telugu: హైదరాబాద్ మహానగరంలోని కిషన్ బాగ్ ప్రాంతంలో వెలసిన శ్రీ మురళి మనోహర స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సుమారు 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది, అయితే కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఇది 400 నుంచి 1000 సంవత్సరాల నాటిదిగా కూడా చెప్పబడుతుంది. ఉత్తరాదిలో శ్రీకృష్ణుడిని “మురళి మనోహర”, “కిషన్ కన్నయ్య” అనే పేర్లతో కొలుస్తారు….

Read Full News

Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయన కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్‌పై సంతం చేశారు.ఈ మేరకు ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతు ముందే లోక్‌ భవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్,…

Read Full News

కేవలం రూ.5 తేడాతో రెండు రీఛార్జ్‌ ప్లాన్స్‌! యూజర్లకు ఇచ్చే బెనిఫిట్స్‌ ఏంటో తెలుసా

మొబైల్ రీఛార్జ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న జియో సంస్థ రూ. 445 మరియు రూ. 450 ధరలతో రెండు విభిన్న ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఒకేలా కనిపించే ఈ రెండు ప్లాన్ల వెనుక ఉన్న ప్రయోజనాలు మరియు వ్యాలిడిటీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా వినియోగదారులు తమకు తగిన సరైన ప్లాన్‌ను ఎంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. జియో రూ. 445, రూ. 450 ప్లాన్ల వివరాలు రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ. 445 ప్రీపెయిడ్ ప్లాన్ ఇరవై…

Read Full News