Indian Railways: సమ్మర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వచ్చింది. వేసవి సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. దీంతో రైళ్లు ప్రయాణికులతో నిండిపోతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి వెళ్లే రైళ్లల్లో నిరంతరం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వేశాఖ ఈ మార్గంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు రద్దీ దృష్ట్యా మరికొన్ని రైళ్లను…