Headlines

Bank Strike: రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు బ్యాంక్‌లు బంద్.. ఏయే బ్యాంకులు మూతపడతాయంటే..?


బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ సమ్మె ప్రభావంతో 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. బ్యాంక్ బ్రాంచుల్లో సేవలు నిలిచిపోయే అకాశముంది. కొన్ని బ్రాంచులు మూతపడే అవకాశముంది. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంక్ సేవల్లో అంతరాయం క్రమంలో ఖాతాదారులు సమస్యలు ఎదుర్కొనున్నారు. వారానికి ఐదు రోజుల వర్కింగ్ డేస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం దిగి రాకపోతే వచ్చే నెల నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది.

ప్రైవేట్ బ్యాంకులు తెరిచే ఉంటాయా..?

ఈ సమ్మె ప్రభావంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. స్టేట్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు జరగవు. అయితే ప్రైవేట్, సహకార బ్యాంకులు యథావిధిగా తెరిచే ఉంటాయి. అయితే ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు విధులకు హాజరవుతారా.. లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులు శాఖను సందర్శించాలనుకుంటే ఒకవేళ ముందుగానే నిర్ధారించుకోండి. ఇక సహకార బ్యాంక్ ఉద్యోగులు కూడా సమ్మెకు పిలుపునివ్వలేదు. దేశంలో 1450 పట్టణ సహకార బ్యాంకులు, 34 రాష్ట్ర సహకార బ్యాంకులు, 351 జిల్లా సహకార బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. గ్రామీణ, సెబీ అర్బన్, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సహకార బ్యాంకులు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఆ బ్యాంకులు తెరిచి ఉంచడంతో సామాన్యులకు ఉపయోగకరంగా ఉండనున్నాయి.

ఏటీఎం చార్జీలు ఉండవ్..

యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదు. దీంతో ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులపై ఈ సమ్మె ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు తమ బ్యాంక్ శాఖలు తెరిచే ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. ఇక ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్‌లు సమ్మె వల్ల ప్రభావం ఉంటుందని ప్రకటించలేదు. దీంతో ఆ బ్యాంక్ శాఖలు కూడా తెరిచే ఉంటాయని భావించవచ్చు. ఇక సమ్మె క్రమంలో ఏటీఎం లావాదేవీలపై మూడు రోజుల పాటు ఎలాంటి చార్జీలు విధించబోమని ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు ప్రకటించాయి. ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి లావాదేవీలు చేసినా ఛార్జీలు మాఫీ చేస్తామని ప్రకటించాయి. ఆన్‌లైన్ సేవలు యథావిధిగా పనిచేస్తాయని, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి విధానాల ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవాలని సూచించింది. వినియోగదారులు ఈ మూడు రోజుల పాటు సహకరించాలని కోరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *