Headlines

స్వర్ణ వార్డు ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!


రాష్ట్రంలోని స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారి పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం నాలుగు కేటగిరీల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తాజా ప్రభుత్వం నిర్ణయం ద్వారా మొత్తం నాలుగు కేటగిరీల్లో కలిసి 1630 మంది ఉద్యోగులకు లబ్ధిచేకూరనుంది.

ముందుగా రెండు కేటగిరీలకు చెందిన మొత్తం 1,630 మందికి ప్రమోషన్ అవకాశాలు దక్కనున్నాయి. ఇందులో భాగంగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రేడ్-2 స్థాయిలో ఉన్న 815 పోస్టులను ప్రభుత్వం గ్రేడ్-1కు అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్రక్రియలో ముందుగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ప్రమోషన్లు కల్పిస్తారు. వారి ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయ్యే పోస్టుల్లో.. డేటాప్రాసెసింగ్ సెక్రటరీలకు పదోన్నతి కల్పిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

మొత్తం నాలుగు కేటగిరీల ఉద్యోగులకు ప్రమోషన్లకు అనుమతి లభించగా, అందులో మిగిలిన మరో రెండు కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లపై కూడా త్వరలోనే స్పష్టమైన నిబంధనలు జారీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో స్వర్ణ వార్డు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *