Headlines

Varun Tej: కొండగట్టు అంజన్నను దర్శించుకుని.. హనుమాన్ దీక్షను స్వీకరించిన హీరో వరుణ్ తేజ్


టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 27) కొండగట్టు అంజన్న దేవాలయానికి వెళ్లిన అతను అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు వరుణ్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే దర్శనానంతరం అతనికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. కాగా వరుణ్ తేజ్ తో పాటు కొరియన్ కనకరాజు సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రముఖ హాస్య నటుడు సత్య కూడా అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాగా ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇటీవలే కొరియన్ కనకరాజు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న వరుణ్ కు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అలాగే డైరెక్టర్ మేర్లపాక గాంధీకి కూడా ఈ మూవీ ఒక మంచి సాలిడ్ హిట్ అందించింది. ఇక ఎప్పటిలాగే కమెడియన్ సత్య తనదైన నటనతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ముగ్గురూ కలిసి ఒకేసారి కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అలాగే హనుమాన్ దీక్షను స్వీకరించారు.

కాగా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ కనకరాజు సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కొరియన్ కనకరాజు తర్వాత బరి అనే సినిమా చేయనున్నాడు వరుణ్ తేజ్. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ యదు వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వాలీబాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిహారిక స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

వరుణ్ వెంట మేర్లపాక గాంధీ, కమెడియన్ సత్య..

Varun Tej 1

Varun Tej

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *