కువైట్ లో చిత్రహింసలు అనుభవించిన మహిళ సేఫ్! ఎలా బయటపడిందంటే..
“నా పేరు వనిత. నేను తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా వాసిని. కువైట్‌కు వచ్చి మూడు నెలలు అవుతోంది. నన్ను ఇక్కడ చాలా హింసిస్తున్నారు” అంటూ వనిత కన్నీళ్లతో తన ఆవేదనను వెలిబుచ్చిన వీడియో వారం రోజుల క్రితం వైరల్ గా మారింది. “నన్ను రక్షించి నా సొంత దేశమైన భారతదేశానికి తీసుకువెళ్లాలని కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాను. గత రెండు నెలలుగా నాకు జీతం కూడా ఇవ్వలేదు. ఇక్కడ జరుగుతున్న హింసను నేను ఇకపై భరించలేను”…