Headlines

టాలీవుడ్ లో గ్యాప్ ఇస్తున్న మిడ్ రేంజ్ హీరోలు


టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోలు వదిలేస్తున్న గ్యాప్‌ను అదర్ లాంగ్వేజ్ హీరోలు వచ్చి ఫిల్ చేస్తున్నారా..? మనోళ్లు చూపిస్తున్న అలసత్వమే వాళ్ళకు వరంగా మారుతుందా..? ఒక్కో సినిమా కోసం మన హీరోలు తీసుకునే రెండు మూడేళ్ల సమయమే పొరుగు హీరోల పాలిట అనుకోని వరం అవుతుందా..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో.. ఈ పరభాషా హీరోల డామినేషన్ ఏంటి..? ఒకప్పుడు నాని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ ఇలా ఏ మీడియం రేంజ్ హీరోను తీసుకున్నా కూడా ఏడాదికి కనీసం ఒకటి.. కుదిర్తే రెండు సినిమాలు చేసేవాళ్లు. వీళ్ళతో సినిమా అంటే బడ్జెట్ కూడా హద్దుల్లో ఉండేది. కానీ ఎప్పుడైతై ప్యాన్ ఇండియా కల్చర్ మొదలైందో.. అప్పట్నుంచి మన మీడియం రేంజ్ హీరోల్లో మార్పు మొదలైపోయింది. స్టార్ హీరోలు ఎలాగూ ఒక్కో సినిమా కోసం మూడేళ్లు తీసుకుంటున్నారు.. ఈ బాటలోనే మిడ్ రేంజ్ హీరోలు వెళ్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేసిన నాని.. ప్యారడైజ్ కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ మూడేళ్లుగా సంబరాల ఏటిగట్టుతో సాగుతున్నారు. మూడేళ్ళ బ్రేక్ తర్వాత ఈ మధ్యే కొరియన్ కనకరాజుతో వచ్చారు వరుణ్ తేజ్. రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూక ఫ్లాపుల తర్వాత స్లో అయిపోయారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక నిఖిల్ కూడా స్వయంభు, ఇండియా హౌజ్ కోసం మూడేళ్లుగా బిజీగా ఉన్నారు. ఇరుముడితో రికార్డులు తిరగరాస్తున్న రవితేజ ఒక్కరే కాస్త జోరు మీదున్నారు. సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నారీయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *