Headlines

rajeshchukka117@gmail.com

Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా అపరకాళి విగ్రహం బయటపడింది. బ్రహ్మంగారి గుడి వద్ద కార్మికులు పనులు చేస్తుండగా ఈ విగ్రహం భూమిలో లభించింది. ఆరు భుజాలు, ఆరు అస్త్రాలతో, రాక్షసుడిని కాళ్లకింద తొక్కి వధిస్తున్నట్లుగా ఉన్న అమ్మవారి చండప్రచండ స్వరూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికితీసిన స్థానికులు వెంటనే పండితుల ఆధ్వర్యంలో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుత…

Read Full News

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌.. ఒకేరోజు హస్తినబాట పట్టిన కీలక నేతలు

తెలంగాణ కాంగ్రెస్ C/O ఢిల్లీ. హస్తం పార్టీ కీలక నేతలంతా హస్తిన బాట పట్టడంతో.. అసలు ఏం జరుగుతోందన్న చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉండడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సురేఖ వెళ్లిన ఫ్లైట్‌లోనే మంత్రులు…

Read Full News

Diabetes Drinks: మందులతోనూ షుగర్ కంట్రోల్ కావడం లేదా? ఈ డ్రింక్స్ మీ డైట్‌లో చేర్చుకోండి!

నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి పానీయాలు రోజువారీ ఆహారంలో భాగంగా ఉండవచ్చు. మెంతి నీరు, ఉసిరి లేదా కాకరకాయ వంటి పానీయాల విషయంలో మాత్రం అవి మందులకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు ఏదైనా కొత్త పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం సురక్షితం. 1. నీరు మధుమేహం ఉన్నవారికి చక్కెర, కేలరీలు లేని నీరు ఉత్తమమైన పానీయాల్లో ఒకటి. తగినంత నీరు…

Read Full News

తల్లిదండ్రుల త్యాగం, కొడుకు పట్టుదల: డాక్టర్ రవితేజ విజయ గాథ

లక్ష్యం గొప్పదైతే ఎదురయ్యే కష్టాలు కూడా చిన్నవైపోతాయని డాక్టర్ రవితేజ నిరూపించారు. కర్నూలు జిల్లాలోని వెనుకబడిన దేవనకొండ ప్రాంతానికి చెందిన రవితేజ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. తొమ్మిదో తరగతిలో తీవ్ర జ్వరంతో కర్నూలు వైద్య కళాశాలలో చేరినప్పుడు, వైద్యులు అందించిన సేవలు చూసి రవితేజ డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఆయనది. తన కుమారుడి కలను నిజం చేయాలని తల్లిదండ్రులు శీను దంపతులు అపారమైన కష్టాలను ఎదుర్కొన్నారు. రవితేజ ఆరో…

Read Full News

పదో తరగతి సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు!

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపై మరింత ఆధునికంగా మారనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీ చేసే మెమోలపై QR కోడ్‌ను ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల టెన్త్‌ సర్టిఫికెట్లపై ముద్రించే QR కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే సంబంధిత విద్యార్థి మార్కుల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. QR కోడ్‌ ద్వారా విద్యార్థుల మార్కుల సమాచారాన్ని సులభంగా పరిశీలించేందుకు…

Read Full News

Vastu Tips: డబ్బు రావడం లేదా.. వచ్చినదంతా ఖర్చవుతోందా? మీ పర్సును ఓసారి చెక్ చేయండి!

వాస్తు ప్రకారం సంపదకు అధిపతిగా భావించే కుబేరుడి దిశ ఉత్తరం. అందువల్ల డబ్బు, విలువైన వస్తువులను ఉత్తర దిశకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పర్సును నేలపై పడేయకుండా శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం మంచిదని చెబుతారు. ముఖ్యంగా పాత రసీదులు, చిరిగిన నోట్లు, పనికిరాని కాగితాలు వంటి వాటిని పర్సులో నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచిస్తారు. 1. పర్సును ఎక్కడ ఉంచాలి? వాస్తు విశ్వాసాల ప్రకారం కుబేరుడికి ఉత్తర దిశ అధిపత్యం ఉంటుంది. అందువల్ల…

Read Full News

Vaibhav Sooryavanshi: 10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. మొదట ఐపీఎల్, ఆ తర్వాత ఇండియా-ఎ, అండర్-19 వరల్డ్ కప్‌లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు, ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్‌లో ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలోనూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈస్ట్ జోన్ తరఫున సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ పోరులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 132…

Read Full News

Morning Tea Side Effects: బెడ్ టీ అలవాటు ఉందా? మీ కడుపులో ఏం జరుగుతుందో తెలుసా?

రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత ఉదయం శరీరానికి ముందుగా ద్రవాలు అవసరం. అలాంటి సమయంలో టీని మొదటి పానీయంగా తీసుకోవడం కంటే ముందుగా నీరు తాగడం, ఆ తర్వాత తేలికపాటి ఆహారం తీసుకుని టీ తాగడం కొంతమందికి మెరుగైన ఎంపికగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి శరీరం కెఫిన్‌కు ఒకే విధంగా స్పందించదు. టీ తాగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకపోతే కూడా, రోజువారీ అలవాటులో పరిమాణం, సమయం రెండింటినీ గమనించడం మంచిది. 1. కడుపులో…

Read Full News

పదో తరగతి, ఇంటర్ మార్కులతో నేరుగా రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రైల్వేలో అప్రెంటిస్‌ శిక్షణ పొందాలనుకునే యువతకు చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC) తీపికబురు చెప్పింది. సదరన్‌ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ ట్రేడుల్లో మొత్తం 4,471 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 27, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్‌, పెయింటర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, ఎంఎంవీ, టర్నర్‌, డీజిల్‌ మెకానిక్‌, కార్పెంటర్‌, వైర్‌మ్యాన్‌,…

Read Full News

Potato Pickle Recipe: మామిడికాయ, నిమ్మకాయ కాదు.. ఆలుగడ్డలతో అదిరిపోయే ఊరగాయ ఇలా చేయండి!

ఆలుగడ్డలతో ఎప్పుడూ కూరలు, ఫ్రైలు మాత్రమే కాకుండా ఈసారి కొత్తగా ఊరగాయను తయారు చేసి చూడండి. ఎక్కువ సమయం తీసుకోకుండా సులభంగా తయారు చేసుకునే ఈ రెసిపీ స్పైసీగా, పుల్లగా, కొద్దిగా తీపి రుచితో అదిరిపోతుంది. మరి ఆలుగడ్డలతో ఈ టేస్టీ ఊరగాయను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు – 2 ఆవాల పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు…

Read Full News